![]() |
![]() |
.webp)
టాలీవుడ్ లో సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఆమె ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ తో కలిసి నటించారు కూడా.
ఇప్పుడు సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. " తారక్ చాలా గొప్ప నటుడు. ఆయన స్టేటస్ ప్రకారం "వారు" అని నేను అనాలి కానీ అలాంటి అల్లరి పిల్లోడిని నేను వాడు అని అంటాను ఎందుకు అంటే తారక్ నా కొడుకు లాంటి వాడు. నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వాళ్ళు. ఒకప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఇప్పుడు అల్లరి తగ్గిపోయి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఎంత గొప్పవాడో చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అన్నపూర్ణ స్టూడియోస్ లో బాద్ షా మూవీ షూటింగ్ లో నేను తారక్ తో కలిసి డాన్స్ చేసే సీన్ చేయాలి. మొదటి టేక్ బానే వచ్చిన ఎందుకో నేనే ఒన్స్ మరి చేద్దాం అని అడిగాను. బాగా చేశారమ్మా మీరు మళ్ళీ ఎందుకు అన్నాడు.
ఐనా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి స్టెప్ వేయబోయేంతలో కాలు స్కిడ్ అయ్యింది బెణికిపోయింది. అది చూసిన తారక్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి కూర్చోబెట్టాడు. అంత పాన్ ఇండియా స్టార్ కి అలా చేయాల్సిన అవసరం లేదు కదా. చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లి పోతూ ఉంటారు. కానీ తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి" అని చెప్పింది సుధ.
![]() |
![]() |